నాకు తెలిసిన, నేను తెలుసుకున్న విషయాలు మీకోసం................
ఇప్పటికి సమాజంలో పెళ్ళికి పెద్దలు చూసే విషయాలు............
---------------------------------------------------------------------------------------
మతము - సంస్కృతి, సాంప్రదాయం - సమాజం
కులము - కుటుంబం, ఆచార వ్యవహారలు - కుటుంబం
జాతకం - దంపతుల స్వభావం - భార్యా భర్తలు
గోత్రాలు, ఇంటిపేర్లు - మూలాలు మరియు రక్తసంబంధం - పిల్లలు
--------------------------------------------------------------------------------------
కాన్సర్ కి మందుల్లేవు ఖఛ్ఛితంగా చచ్చి పొతాడు ఎందుకు అని అనుకుని వదిలేసి ఉంటే ఇప్పుడు కాన్సర్ కి మందు ఉండేదే కాదు.కాబట్టి గీతకు ఆటువైపు వెళ్ళీ చూస్తేనే మనిషికి మనుగడ సాధ్యం....అందుకే నా ఈ ప్రయత్నం ............
------------------------------------------------------------------
మతము : పెళ్ళిచేసుకునే వాళ్ళు ఒకే మతానికి చెందిన వారైతే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఒకేలా ఉంటాయి కనుక వారి జీవితం సుఖంగా ఉండొచ్చు....!
కులము : పెళ్ళిచేసుకునే వాళ్ళు ఒకే కులానికి చెందిన వారైతే వాళ్ళ వృత్తి,ఆచారాలు మరియు ఆహారపు అలవాట్లు ఒకేలా ఉంటాయి కనుక వారి జీవితం సుఖంగా ఉండొచ్చు....!
జాతకం : జాతకం అంటే స్వభావం, జాతకాల పొంతనలు కలవడం వల్ల పెళ్ళిచేసుకునే వాళ్ళ స్వభావాలు దగ్గరదగ్గరగా ఉంటాయి కనుక వారి జీవితం సుఖంగా ఉండొచ్చు....!
గోత్రాలు మరియు ఇంటి పేర్లు : ఇవి మనిషియొక్క వంశమూలాలు మరియు రక్త సంబంధాలు తెలియజేస్తాయి కునుక ఒకే ఇంటి పేరు ఒకే గోత్రం ఉండే వాళ్ళు పెళ్ళి చేసుకోకుండా ఉంటే పుట్టే పిల్లలు వైకల్యం లేకుండా పుట్టచ్చు. ఇది పూర్తిగా జన్యు శాస్త్రానికి సంబందించింది.కానీ .......
--------------------------------------------------------------------------------
కనుక పైన చెప్పిన వన్నీ ఉపయోగకమైనవే, కానీ అవి ఎవరికి ఉపయోగపడుతాయి ఎంతవరకు ఉపయోగపడుతాయి అని ఆలోచించడం మానేసి గుడ్డిగా మేము రాసుకున్నవే మాకు తెలిసనవే మంచి మిగతాదంతా చెడ్డ అనుకుంటే మానవ మనుగడ సాధ్యం కాదు .... అలా సమాజం గీసుకున్న కొన్ని గీతల్ని దాటి నేను తెలుసుకున్న కొన్ని విషాలు మీకోసం అందిస్తున్నా ........ కనీసం కొంతమందైనా మరుతారు అని.........
అసలు పై వాటి వల్ల ఉపయోగాలున్నాయా ఉంటే ఎవరికి ఉన్నాయి......? దానికి ఖఛ్ఛితంగా ఉంది అని అంగీకరించాల్సిందే కారణం ..
పెద్దలు కుదిర్చే పెళ్ళిలో అమ్మాయికి అబ్బాయి గురించి తెలియదు అబ్బాయికి అమ్మాయి గురించి తెలియదు ,ఇలాంటి పెళ్ళికి పైన చెప్పినవన్నీ ఉపయోగపడుతాయి, కాని కేవలం పైన చెప్పిన వాటి వల్ల మంచి జరుగుతుంది అని ఆసించి చెసేవే కాని మరొక్కటి కాదు.... దీనికి ఒక నిర్దిస్టతలేదు అని అనడానికి పెద్ద ఉదాహరణ మన సమాజమే...
కుల మతాల గురించి నాకంటే ముందే చాలామంది చెప్పారు కాబట్టి నేను చెప్పదలిచినవి జాతకాలు(దోషాలతొ కలిపి) మరియు గోత్రాల గురించి......
గోత్రాలు click
జాతకం click
పైన చెప్పబడినవన్నీ పెద్దలు కుదిర్చే వివాహాలకు మాత్రమే, మనకు ఇంకో 3 రకాల వివాహాలు ఉన్నయి అవి ప్రేమ,గాంధర్వం, రాక్షసం.వీటిలో ప్రేమ తప్ప మిగిలిన రెండు మన సమాజంలో కష్టం.
కుల మతాలకు అతీతంగా ప్రేమించుకునే ప్రేమికుల మధ్య ఒకరిపై ఒకరికున్న ఇష్టం వాళ్ళని విడిపోకుండా చేస్తుంది, కాబట్టి వీరికి పైన చెప్పిన వాటితో పనిలేదు వారికి వాటి అవసరం కూడా లేదు. ఇక్కడ ప్రేమికులు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు, ఒకరితో ఒకరు పూర్తిగా జీవితాన్ని ( పెళ్ళి, కాపురం, పిల్లలు, భవిష్యత్తు చివరికి చావు ) మొత్తం ముందే ఊహించుకుంటున్నారు.వీరి పెళ్ళికి అడ్డు పెద్దలు ఒప్పుకోక పోవడం. కాదని వాళ్ళాని ఒప్పించడానికి ప్రయత్నిస్తే చస్తామనో లేక చంపుతామనో బెదిరించి వాళ్ళని విడదీసి వేరే పెళ్ళిళ్ళు చేయాలని అనుకుంటారు కానీ...............
వాళ్ళు ఆ పెళ్ళిళ్ళకు ఒప్పుకుంటారా.............?
ఒకవేళ తలొంచి పెళ్ళి చేసుకున్నా ,వారివారి భాగస్వాములలొ వారి ప్రేకులని ఊహించుకొని కాపురం చెయ్యాల్సిందే. ఇలా చెయ్యడం మోసం అంతే..
లేకా బయటకి వెళ్ళి పెళ్ళిచేసుకుని నాఅన్న వాళ్ళకి దూరంగా జీవిస్తారా ....?
లేక చచ్చిపోతారా.............?
సమాధానం చెప్పడం కష్టం , పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు..........
ఈ పరీస్థితి మారాలంటే రెండే మార్గాలున్నాయి
1.పెద్దలు పిల్లల ప్రేమలో నిజాయితీని చూసి పెళ్ళి చేయడం లేక
2.నిఘంటువునుంచే ప్రేమ అనే పదాన్ని తొలగించడం.......................................
ఈ పరీస్థితి మారాలంటే రెండే మార్గాలున్నాయి
1.పెద్దలు పిల్లల ప్రేమలో నిజాయితీని చూసి పెళ్ళి చేయడం లేక
2.నిఘంటువునుంచే ప్రేమ అనే పదాన్ని తొలగించడం.......................................