"The silence of good people is more dangerous than the brutality of bad people"

Monday, October 31, 2011

సగోత్రం



ఇక్కడ మనలో చాలా మంది మను (3,5),గౌతమ (4),ఆపస్తంభ (5,7,11) ధర్మ శాస్త్రాలను అనుసరించి సగోత్రపెళ్ళి వద్దంటారు కాని అక్కడ రాసిన దాన్ని అర్థం చేసుకోరు వారికి అది అవసరం కూడా లేదు అని అనుకుంటారు.నిజానికి వాటిలో, ఇంచుమించు ఆరు తరాలు వరకు ఆడవారి వైపు " సపిండం " మగ వారి వైపు " సగోత్రం " పెళ్ళి నిషిద్ధం, కాని పూర్తిగా నిషిద్ధం అని ఏమహానుభావుడు రాయలేదు. కనీసం దాన్ని అర్థం చేసుకునేదానికి కూడా ప్రయత్నించడం లేదు మనం. ఇది శాస్త్రానికి సంబందించింది ..........

సగోత్ర మూలాలు పరిశీలిస్తే అది ఇప్పటి జన్యు శాస్త్రానికి అనుసంధానమౌతుంది. జన్యు శాస్త్ర ప్రకారం 50% లేదా అంతకంటే ఎక్కువ రక్తసంబంధం కలిగినవారు పెళ్ళి చేసుకుంటే పుట్టే పిల్లలు జన్యు లోపాలతో పుడుతారు ఇది ఛ్చితమైన నిజం. కాబట్టి అప్పటి పరిస్థితుల ప్రకారం సగోత్రం అప్పుడు అనుసరణీయం కాని ఇప్పుడు ఆ అవసరం జన్యు పరీక్షతో తీరిపోతుంది.ఇది జన్యు శాస్త్రం................

చరిత్రకి వస్తే 8 మంది ఋషులు మన గోత్రాలకి మూలాలు.వారిలొ అందరూ బ్రాహ్మణులే.వారినుంచి మరో 256 గోత్రాలు పుట్టుకొచ్చాయి. మరి మిగతా కులాల వారికి ఎలా బ్రాహ్మణ గోత్రాలు వచ్చాయి అని అడగలేను.దీనికి కారణం కొన్ని వేల సంవత్సరాల క్రితం వాడుకలో ఉన్న గురు-శిష్య పరంపర ,దీనిలొ భాగంగా గురువులైన బ్రాహ్మణుల గోత్రాలనే మిగతా కులాల వాళ్ళు అనుసరించారు. దీనిని బట్టి చూస్తే వేరు వేరు కులాలకు చెందిన వ్యక్తుల మధ్య పెళ్ళికి సగోత్రం అడ్డు కానే కాదు. ఇది చరిత్ర.......

అమ్మాయి అబ్బాయి ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలనుకుంటే హిందు వివాహ చట్టం సెక్షన్ 5 (1955) ప్రకారం సగోత్ర వివాహం న్యాయ సమ్మతం ఎవరు ఆపలేరు. ఇది చట్టం......


No comments:

Post a Comment