"The silence of good people is more dangerous than the brutality of bad people"

Monday, October 31, 2011

జాతకం


జాతకం అంటే మనిషి పుట్టిన తేది ,పుట్టిన సమయం మరియు పుట్టిన ప్రదేశంబట్టి మనిషి స్వభావాన్ని ,నడవడిని ముందుగా ఊహించి చెప్పడం. ఇది పూర్తిగా 100% ఖఛ్ఛితంగా జరుగుతుందని ఏ జ్యోతిష్కుడు చెప్పలేడు.
మరి ఈ జాతకం ఎలా ఉపయోగపదుతుంది --
దీంట్లోనే మరొక విషయం కుజ (అంగారక లేదా మాంగలిక్) దోషం ,ఇది పూర్తిగా భార్యా భర్తలకు మాత్రమే సంబందించినది.దీనికోసం జనాలు నివారణ పూజలు చేస్తారు తగ్గుతుందనుకుంటారు కాని ఉదాహరణకు, ఒక వ్యక్తికి కోపం ఎక్కువ వాడు ప్రతి నిమిషం గొడవలకు పోయేవాడు అనుకుందాం, అతనితో ఉపవాసం చేయించి రోజంతా పూజలో కూర్చోపెడితే పక్క రోజు అతను గొడవలు కాదు కదా కనీసం కాలు కూడా కదపలేడు. ఇదే దోషనివారణ, ఇందులో పూర్తిగా కాక పోయిన కనీసం కొంత రోజూ చేస్తే దోషం పూర్తిగా తొలగినట్లే. కానీ జనాలు గీత గీసుకొని దోషాల పేరుతో వివాహాలు చెయ్యకుండా కూర్చుంటే మగ వారికి నష్టం పెద్దగా ఉండదు కానీ ఆడపిల్లలు, వారి తల్లితండ్రులు ఏది నమ్మాలో ఏవిధంగా పెళ్ళి జరుగుతుందోనని అనునిత్యం బాధతో భయంతో బతుకుతున్నారు. కొద్దిగా సమాజం కనీసం యువతైనా ఆలోచించాలి.

ఇదంతా నమ్మని వాళ్ళు , తప్పనే వాళ్ళు చాలా మంది ఉంటారు....... అలాంటి వారికోసం.........

భారత దేశంలో మొత్తం ఎన్ని న్యాయస్థానాలున్నాయి ? ఇంచుమించుగా కొన్ని వేలు........
వాటిల్లో ఎన్ని విడాకులు, వరకట్న హత్యలు, గృహహింస కేసులు ఉన్నాయి? ఇంచుమించు కొన్ని లక్షలు.............
వాటిలో 95% జాతకాలు కుదిరి పెద్దల సమక్షంలో జరిగినవే, మరి జాతకాలే నిజం అనుకుంటే మరి ఆ వివాహాలు ఎందుకు అలాఅయ్యాయి.......
దీనికి సమాధానం ఉండదు ఉన్నా మిగతా వాళ్ళు బాగానే ఉన్నారుకదా అని సమాధానం ఇస్తారు అంతే. జాతకం ఒక నమ్మకం అంతే దాన్ని గుడ్డిగా అనుసరిచడం అన్యాయం.
అలా ప్రేమించి జాతకాలను దోషాలను లెక్క చేయక పెళ్ళిచేసుకుని హాయిగా జీవించే వాళ్ళూ ఉన్నరు,ఒక్కటి మాత్రం నిజం వీళ్ళు కలిసుంటారు వాళ్ళు విడి పోతారు అని ఎవ్వరు చెప్పలేరు కారణం మనిషికి తనకు తాను 100 సంవత్సరాలు బతుకుతాడని తనకే నమ్మకం లేదు.

అందరూ వాళ్ళకనుగుణంగా గీతలు గీసుకుని కూర్చుని ఉంటే సమాజం నుంచి సతీసహగమనం,బాల్యవివాహాలు,కన్యాశుల్కాలు,అంటరానితనం లాంటివి ఏవిధంగా దూరమౌతాయి,అంటే మనిషి తను కావాలనుకుంటే దేన్నైనా మార్చగలడు కాబట్టి కొద్దిగా అందరు ఆలోచించండి మిగిలిన ఈ అడ్డుగీతల్ని కూడా చేయికలిపి చెరిపివేయండి.

No comments:

Post a Comment