ఈమద్య FB లో గోరక్షణ అనే పోస్ట్ మీద ఒక కుర్రాడు ఒక ప్రశ్న వేసాడు.......
చాలామంది ఇండియాలో కోళ్ళని, మేకల్ని, గొర్రెల్ని, పక్షుల్ని,అన్ని జంతువుల్ని తింటున్నారు కాని చాలా పౌష్టిక విలువలున్న ఆవుని మాత్రం తల్లి అని చెప్పి తినకూడదు అంటున్నారు .... ఎందుకు ...?
అతను కావాలని అడిగి ఉండవచ్చు లేక తెలియక అడిగి ఉండవచ్చు ........
నేను అనుకోవడం ఏంటంటే .....
నాగరికత పుట్టక ముందే అప్పటి వారు తమకు నిత్యం ఉపయోగ పడే వాటిని పూజించేవారు .....గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశాన్ని పంచభూతాలుగా పూజించేవారు ..... ఉపయోగ పడే ప్రతి చెట్టుని , మొక్కని దైవ సమానంగా చూసేవారు... ఉదాహరణకు తులసి, వేప, కొబ్బరి, మామిడి,ఉసిరి, రావి, వరి......... ఇలా అనేకం..
మనకు ఉపయోగ పడే వాటిని గౌరవించాలి అని గ్రహించి వారు ఆచరించడమే కాకుండా భావితరాలకు అందించారు ......
అది భారతీయ సంస్క్రుతి, నాగరికతల్లో......ఒక భాగమయ్యింది...
ఇక ఆవు విషయానికి వస్తే ......పూర్వకాలంలో ప్రతి ఒక్కరు విధిగా అవుని పెంచేవారు ......పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మిఠాయిలు, హోమానికి, చావులకి పిడకలు, దైవస్మరణకి విభూది, భూసారానికి ఎరువు, ఆయుర్వేద మందుల తయారి ........ఇలాంటి వాటికోసం....పెంచేవారు.....కనుక ఆవుని
ఒక జంతువులా కాకుండా ...కుటుంబంలో ఒక మనిషిలా అంతకంటే ఎక్కువ ఒక దైవంలా పూజించేవారు.
ఐనా....
రెండు నెలలు కూడా బిడ్డకు పాలు ఇవ్వని విష సంస్క్రుతిని అలవర్చుకుంటున్న వారిని కూడా తల్లిగా భావించే గొప్ప సంస్కారం ఉన్న భారతీయులు .... ఏమీ ఆసించకుండా మనందరికి అవి ఇవ్వగలిగినన్ని రోజులు పాలుఇచ్చి అనేక విధాలుగా ఉపయోగపడుతుంటే ....
అలాంటి ఆవులని ......తల్లిగా ....గోమాతగా
ముక్కోటి దేవతలకు సమానంగా పుజించటంలొ .........తప్పు లేదు అని నా భావన.....
ఇక మిగతావాటిని ఆహరంకోసమే పెంచే వాళ్ళు.....ఐనా వాటిని చంపేటప్పుడు కూడా దైవ ప్రార్థన చేసి క్షమించమని అడిగి ఆకలి తీర్చుకుంటున్నారు....